Hyderabad, జూన్ 23 -- సూర్యుడు గ్రహాలకి రాజు. సూర్యుడు లేకపోతే జీవనం ఉండదు. సూర్యుడి కాంతి కిరణాలు సానుకూల శక్తిని ప్రతి చోట నింపుతాయి. చాలామంది ప్రతిరోజూ సూర్య భగవానుడిని ఆరాధించి, అర్ఘ్యం సమర్పిస్తారు, పూజలు చేస్తారు, మంత్రాలు చదువుతారు. సూర్యుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో బలం, ధైర్యం, ఆరోగ్యం, శ్రేయస్సు పొందవచ్చు.

సూర్య భగవానుడు ఆదర్శ నాయకత్వం, అత్యున్నత స్పృహకు చిహ్నంగా పరిగణించబడతాడు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కొన్ని రాశుల వారిపై సూర్య భగవానుని ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. మరి ఏ రాశుల వారిపై సూర్య భగవానుని అనుగ్రహం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశుల వారు నిజంగా చాలా అదృష్టవంతులు. వీరిపై సూర్య భగవానుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. సూర్యుడు వారిని ఎప్పుడు రక్షిస్తాడు, సంపదను అందిస్తాడు. ఈ రాశుల వారు కుటుంబంలో గౌరవం, మర్యాదలు ...