భారతదేశం, జనవరి 23 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. జనవరి 23 సూర్యుడు, యముడు సంయోగం జరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైనది. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. అదృష్టం పెరుగుతుంది. ఆదాయం కూడా ఎక్కువవుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక లాభాలు కలుగుతాయి.

జనవరి 23న సూర్యుడు మరియు యముడు 0 డిగ్రీల వద్ద సంయోగం చెందుతారు. హిందూ మతంలో యముడిని సూర్యుడి కుమారుడిగా చెబుతారు. యముడిని ధర్మరాజు అని కూడా అంటారు. ఈ రెండిటి సంయోగం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ రెండిటి కలయిక వలన కొన్ని రాశుల వారి అదృష్టం పెరుగుతుంది. సక్సెస్‌ను అందుకుంటారు. కొత్త అవకాశాలు స్వయంగా వెతుక్కుంటూ వస్తాయి.

మేష రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో మేష రాశి వ...