Hyderabad, సెప్టెంబర్ 30 -- ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) ఇండియన్ సినిమాకు వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఓ కొత్త రిపోర్టు రిలీజ్ చేసింది. 2000 సంవత్సరం నుంచి ఇండియన్ సినిమాలోని ముఖ్యమైన ట్రెండ్‌ల మీద ఈ రిపోర్ట్ విడుదల చేశారు. గత 25 ఏళ్లలో ఇండియాకు చెందిన సినిమాలను అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ రిపోర్టులో ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాకు ఫాలోవర్స్ పెరిగినట్లు కూడా తేలింది. అయితే మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీ మాత్రం ఆశ్చర్యం కలిగించేదే.

ఐఎండీబీ రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్‌లోని 'ఇండియాస్ గ్లోబల్ మూమెంట్' సెక్షన్, ఇండియన్ సినిమాలు విదేశీ ప్రేక్షకులను ఎలా ఆకర్షిస్తున్నాయో వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాల పాపులారిటీని ఒక గ్రాఫ్‌లో చూపించింది. దీన్ని గ్లోబల్ పేజ్ వ్యూస్, న...