భారతదేశం, ఏప్రిల్ 17 -- జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన 'మిడ్​నైట్ కార్నివాల్' క్యాంపైన్​లో భాగంగా హెక్టర్ ఎస్​యూవీపై అనేక ఆఫర్లు, బెనిఫిట్స్​ని ప్రకటించింది. ఎంజీ హెక్టార్ రూ .4 లక్షల వరకు విలువైన బెనిఫిట్స్​తో ప్రస్తుతం అందుబాటులో ఉండనుండటం విశేషం. ఇది దేశవ్యాప్తంగా ఉన్న షోరూమ్స్​లో లభిస్తుంది. మిడ్​నైట్ కార్నివాల్​లో భాగంగా జూన్ 30, 2025 వరకు ప్రతి వారాంతంలో అర్ధరాత్రి వరకు ఎంజీ షోరూమ్స్​ తెరిచి ఉంటాయి.

మిడ్​నైట్ కార్నివాల్ క్యాంపైన్​లో భాగంగా జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా హెక్టార్ ఎస్​యూవీ కొనుగోలుతో అనేక విలువైన ఆఫర్లను అందిస్తోంది. ఇందులో 2 సంవత్సరాలు / 1 లక్ష కిలోమీటర్ల ఎక్స్​టెండెడ్​ వారంటీతో పాటు ప్రామాణిక మూడు సంవత్సరాల వారంటీ, రెండు అదనపు సంవత్సరాల రోడ్​సైడ్ అసిస్టెన్స్ ఉన్నాయి. దీని వల్ల ఐదేళ్ల వరకు ఇబ్బందులు లేకుండా ఓ...