Andhrapradesh, సెప్టెంబర్ 4 -- చేనేత ఉత్పత్తులకు మార్కెంటింగ్ కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త సదుపాయం కల్పిస్తోంది. రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ చేనేత బజార్లు ఏర్పాటు చేయిస్తోంది. అదే సమయంలో ఆప్కో ద్వారా అమ్మకాలు పెంచేలా చర్యలు చేపట్టింది. వినియోగదారులకు చేనేత దుస్తులను మరింత చేరువ చేయడానికి ఆప్కో ద్వారా డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థల ద్వారా అమ్మకాలు ప్రారంభించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 40 ఆప్కో షోరూమ్ లను సిద్ధం చేసింది. నేటితరం అభిరుచులకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పోచంపల్లి, ధర్మవరం, మంగళగిరి పట్టు చీరలతో పాటు రెడీమేడ్ దుస్తులను కూడా ఆప్కో షో రూమ్ లతో పాటు ఆన్ లైన్ లోనూ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. యువత, మహిళ, చిన్న పిల్లలు... ఇలా వర్గాల వారిని ఆకట్టుకునేలా చేనేత రెడీమేడ్ దు...