భారతదేశం, నవంబర్ 26 -- సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే ఏదైనా చేయడానికి రెడీ అని అంటుంటారు హీరోయిన్లు. తాజాగా తమిళ నటి ఆండ్రియా జెరేమియా కూడా అలాంటి కామెంట్సే చేసింది. తన నెక్ట్స్ హారర్ మూవీ పిశాచి 2 సినిమాలో న్యూడ్ సీన్లు ఉన్నాయా అన్నప్పుడు.. అవి లేకపోయినా ఎరోటిక్ సీన్లు మాత్రం చాలానే ఉన్నాయని చెప్పింది.

తమిళంతోపాటు తెలుగులోనూ వచ్చిన ఆకట్టుకున్న హారర్ థ్రిల్లర్ మూవీ పిశాచి. ఇప్పుడీ సినిమాకు పిశాచి 2 రూపంలో సీక్వెల్ వస్తోంది. మిస్కిన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై ఆండ్రియా స్పందించింది. ఈ సినిమాలో న్యూడ్, బోల్డ్ సీన్ల గురించి మాట్లాడింది. మిస్కిన్ లాంటి సీనియర్ డైరెక్టర్ ఓ పాత్ర కోసం ఏదైనా అడిగినప్పుడు అతన్ని నమ్మాల్సిందే అని ఆమె అనడం విశేషం.

"నిజానికి స్క్రిప్ట్ దశలో న్యూడ్ సీన్లు ఉన్నాయి. కానీ షూటింగ్ సమయంలో మిస్...