భారతదేశం, ఏప్రిల్ 24 -- ఒప్పో తన లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ5 ప్రో 5జీ ని భారత్ లో లాంచ్ చేసింది. ఒప్పో ఎ5 ప్రో 5 జి ఐపి 69, ఐపి 68, ఐపి 66 సర్టిఫికేషన్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 360-డిగ్రీల ధృఢమైన కవచ బాడీ, ఎక్స్ ట్రీమ్ వాటర్ ప్రూఫింగ్, 14 మిలిటరీ-గ్రేడ్ పర్యావరణ పరీక్షల సర్టిఫికేషన్ కలిగి ఉంది. ఒప్పో నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ డివైజ్ లో ఇంకేం ఫీచర్స్ అండ్ స్పెక్స్ ఉన్నాయో చూద్దాం.

ఒప్పో ఏ5 ప్రో 5జీ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 గా ఉది. మోచా బ్రౌన్, ఫెదర్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఒప్పో ఏ5 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఈ-స్టోర్, రిటైల్ ఔట్లెట్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో ఎ5...