Hyderabad, జూలై 25 -- మలయాళ స్టార్, పుష్ప మూవీతో తెలుగు వారికి కూడా దగ్గరైన ఫహద్ ఫాజిల్ ఈ మధ్య టెక్నాలజీకి దూరంగా ఉంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన జీవనశైలిని అలవర్చుకుంటున్నాడు. అతడు ఓ సాధారణ ఫీచర్ ఫోన్ వాడుతున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫహాద్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత ఊబర్ డ్రైవర్ అవుతాడట.

ఓ స్టార్ హీరో అంటే ఎలా ఉండాలి? మార్కెట్ లోకి ఏ కొత్త కారు, ఫోను వచ్చినా అది వాళ్ల చేతుల్లో కనిపిస్తుంది. కానీ మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. అతడు ఏడాదిగా స్మార్ట్ ఫోన్ కూడా వాడటం లేదట. ఒకప్పటి కీప్యాడ్ ఉండే ఫీచర్ ఫోన్ వాడుతుండటం విశేషం. ఎందుకిలా అని అడిగితే ఫహాద్ ఏమన్నాడో చూడండి.

"నేను గత ఏడాదిగా ఒక డంబ్ ఫోన్ వాడుతున్నాను. ఇంటర్నెట్‌కు పూర్తిగా దూరం...