భారతదేశం, మార్చి 31 -- సుజుకి తన పాపులర్ స్కూటర్ బర్గ్‌మన్ స్ట్రీట్ 125 అప్‌డేటెడ్ వెర్షన్‌ను త్వరలో విడుదల చేసేందుకు రెడీ అవుతుంది. ఇటీవల ఈ స్కూటర్ టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది కొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఈ స్కూటర్ ముందు, వెనుక డిజైన్‌లో కంపెనీ కొన్ని ముఖ్యమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. స్కూటర్ రూపాన్ని మరింత శక్తివంతం చేస్తుంది. సైడ్ ప్యానెల్స్, వంపులు మునుపటి కంటే భిన్నంగా కనిపిస్తాయి. ఇప్పుడు రిఫ్లెక్టర్లను ముందు మడ్ గార్డ్ నుండి ఫుట్ బోర్డ్‌కు మార్చారు. వెనుక నుండి ఈ స్కూటర్ సూపర్‌గా కనిపిస్తుంది. ఇది మరింత స్టైలిష్‌గా ఉంటుంది.

బర్గ్‌మన్ స్ట్రీట్ 125 స్కూటర్‌లో సుజుకి కొన్ని కొత్త ఫీచర్లను జోడించే అవకాశం ఉంది. అయితే ఇంజిన్ మాత్రం అలాగే ఉంటుంది. ఈ స్కూటర్ 124 సీసీ, ఎయిర్-కూల్డ్ ఇంజ...