భారతదేశం, డిసెంబర్ 16 -- 'హ్యాపీ డేస్' హీరో వరుణ్ సందేశ్ తొలిసారిగా డిజిటల్ ఎంట్రీ ఇస్తూ 'నయనం' (Nayanam) అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఎప్పుడూ లవర్ బాయ్ పాత్రల్లో కనిపించే వరుణ్.. ఇందులో ఇతరుల జీవితాల్లోకి తొంగిచూసి, నేరాలు చేసే ఒక క్రేజీ డాక్టర్‌గా కనిపించబోతున్నాడు. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిసెంబర్ 19న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకునే పనిలో పడ్డాడు. పక్కింటి కుర్రాడి పాత్రలకు గుడ్ బై చెప్పి.. వెన్నులో వణుకు పుట్టించే 'సైకో డాక్టర్' పాత్రతో ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన న్యూ ఏజ్ థ్రిల్లర్ 'నయనం'. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ నయనం వెబ్ సిరీస్‌లో తన పాత్ర గురించి ...