Hyderabad, సెప్టెంబర్ 15 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన తొలి ఫిమేల్ సూపర్ హీరో సినిమా లోకా: ఛాప్టర్ 1 చంద్ర. ప్రముఖ నటి కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ సినిమా గురించి ఒక ఈవెంట్‌లో మాట్లాడాడు. అతడు త్వరలో రాబోతున్న తన సినిమా 'మిరాజ్' ప్రమోషనల్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. లోకా సక్సెస్ తర్వాత అందరు ఫిల్మ్ మేకర్స్‌ ఇక సూపర్ హీరో సినిమాల మీద పడొద్దని వార్నింగ్ ఇచ్చాడు.

ఒక నిర్దిష్ట జానర్‌లోని సినిమా హిట్ అయితే ఫిల్మ్ మేకర్స్ ఆ ట్రెండ్‌ను ఉపయోగించుకోవడానికి చూస్తారని జీతూ జోసెఫ్ అభిప్రాయపడ్డాడు. అయితే సినిమా ఇండస్ట్రీ వైవిధ్యం ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అతడు స్పష్టం చేశాడు. "ఒక ఇండస్ట్రీలో వివిధ జానర్ల నుంచి సినిమాలు ఉండాలి. సాధారణంగా జరిగేది ఏమిటంట...