భారతదేశం, డిసెంబర్ 27 -- ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటించిన 'ధురంధర్' (Dhurandhar) సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా విజయంపై సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ.. విమర్శకులపై గట్టిగా ఫైర్ అయ్యారు. ఈ సినిమాను కేవలం ఓ దుష్ప్రచారం (propaganda) కోసం తీశారని విమర్శించిన వాళ్లకు.. ఈ సక్సెస్ ఒక గట్టి చెంపపెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు.

రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ డైరెక్షన్ లో వచ్చిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్'. ఈ సినిమా రిలీజ్ కి ముందే కొంతమంది ఇది ఒక వర్గానికి మద్దతుగా తీసిన ప్రాపగాండా సినిమా అంటూ విమర్శలు చేశారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా వసూలు చేసింది. దీనిపై అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.

అనుపమ్ ఖేర్ శ...