భారతదేశం, జనవరి 29 -- ఎప్పుడో 29 ఏళ్ల కిందట అంటే 1997లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా 'బోర్డర్'లో భైరన్ సింగ్ రాథోడ్ పాత్రలో మెప్పించాడు సునీల్ శెట్టి. ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ 'బోర్డర్ 2'లో తన కొడుకు అహాన్ శెట్టి నటించడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాడు. అయితే తన కొడుకు సినిమా అయినా సరే తాను ఇప్పుడే చూడనని అతడు ఓ కండిషన్ పెట్టుకున్నాడు. మిడ్-డేతో మాట్లాడుతూ తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో వెల్లడించాడు.

గత వారం జరిగిన బోర్డర్ 2 సినిమా ప్రీమియర్ షోకి సునీల్ శెట్టి హాజరయ్యాడు. కానీ సినిమా చూడలేదు. దీని గురించి అతడు మాట్లాడుతూ.. "ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల వసూళ్లు సాధించే వరకు నేను చూడనని మొదటి రోజు నుంచే చెప్పాను. ఇది నా కొడుకు అహాన్ కోసం నేను మొక్కుకున్న మొక్కు. ఇప్పటివరకు నేను ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదు. నన్ను తప్పుగా...