భారతదేశం, డిసెంబర్ 10 -- ఇండియా తరఫున 2026 ఆస్కార్ లకు ఎంపికైన మూవీ 'హోమ్‌బౌండ్'. ప్రముఖ దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ఈ సినిమాను చూసిన సూపర్ స్టార్ షారుక్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. సినిమాలోని నిజాయితీ, భావోద్వేగాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అతడు చెప్పాడు. ఇది నిజంగా ప్రత్యేకమైన సినిమా అని కొనియాడాడు.

ఆస్కార్స్ కు ఇండియా తరఫున అధికారిక ఎంట్రీగా నిలిచిన హోమ్‌బౌండ్ మూవీపై బుధవారం (డిసెంబర్ 10) ఎక్స్ వేదికగా షారుక్ రివ్యూ ఇచ్చాడు. ఇందులో అతడు మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

"హోమ్‌బౌండ్ మూవీ చాలా సున్నితంగా, నిజాయితీగా, మనసును తాకేలా ఉంది. ఇంత మానవీయమైన, ఆసక్తికరమైన సినిమాను సృష్టించిన అద్భుతమైన టీమ్‌కు నా ప్రేమ, నా హగ్స్. నిజంగా ప్రత్యేకమైన చిత్రాన్ని తీసి మీరు ప్రపంచవ్యాప్తంగా హృదయాలను ...