Hyderabad, సెప్టెంబర్ 9 -- అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన మూవీ కిష్కింధపురి. ఈ సినిమా ఈ శుక్రవారం (సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్లలో టీమ్ బిజీగా ఉంది. ఇందులో భాగంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో ఒకదాంట్లో అతడు విసిరిన ఓ ఛాలెంజ్ ప్రేక్షకులను ఆకర్షించింది.

కిష్కింధపురి మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. Gulte.com కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులోనే అతడు సినిమా గురించి ఎన్నో విషయాలు చెబుతూ.. రెండున్నర గంటలపాటు ప్రేక్షకులు అన్నీ మరచిపోయి మూవీలో లీనమయ్యేలా చేసే సత్తా ఈ కిష్కింధపురికి ఉందని అన్నాడు.

మూవీ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు తమ మొబైల్స్ పట్టుకోకపోతే చాలు మనం విజయం సాధించినట్లే.. ఈ సినిమా కూడా అలాంటిదే.. మూవీ పది నిమిషాల తర్వాత ఎవరైనా ప్రే...