భారతదేశం, అక్టోబర్ 29 -- రవితేజ నటించిన మాస్ జాతర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కొందరు నటులు తమ రాబోయే సినిమాల గురించి చేస్తున్న బోల్డ్ కామెంట్స్ లాగే రాజేంద్రుడు కూడా మాస్ జాతర మూవీ చూసి మీరు షాకవ్వకపోతే ఇండస్ట్రీ వదిలేస్తాననడం విశేషం.

మాస్ జాతర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ తనదైన స్టైల్లో మాట్లాడాడు. "ఇక్కడున్న బ్యాచ్ లో చాలా మంది నా సినిమాలు చూసే పెరిగి ఉంటారు. చూశారా లేదా చెప్పండెహే.. ఈ సౌండ్ కావాలి నాకు.. ఈ సౌండ్ లేకపోతే నాకు చిరాకు. ఈ సౌండ్ నేర్పిందే నేను కదా. చాలా కాలం తర్వాత ఓ మంచి మాస్ సినిమా చేశాను.

అన్ని రకాల మసాలాలు ఉన్న మాస్ సినిమా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు. దెబ్బకి మాస్ జాతర వచ్చింది. ఈ సినిమాలో ఏముంది ఏం లేదు అనేది నేను...