Hyderabad, అక్టోబర్ 3 -- రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, ప్రధాన పాత్రలో నటించిన 'కాంతార ఛాప్టర్ 1' సినిమా పాజిటివ్ రివ్యూలతో మొదలైంది. బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించాడు. శుక్రవారం (అక్టోబర్ 3) ఎక్స్ వేదికగా అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

కాంతార ఛాప్టర్ 1 సినిమాపై ఇప్పటికే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాలాంటి టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను ప్రశంసించిన దర్శకుల జాబితాలో చేరాడు. రిషబ్ చేసిన ప్రయత్నాన్ని చూసి దేశంలోని దర్శకులందరూ సిగ్గుపడాలి అని అతడు అన్నాడు. 2022లో వచ్చిన కాంతార స్లీపర్ హిట్‌గా మారిన నేపథ్యంలో ఈ ప్రీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు రచయితగా, దర్శకుడిగా వ్యవహరించిన రిషబ్ శెట్టి మరోసారి తనను తా...