భారతదేశం, నవంబర్ 11 -- తమిళంలో విడుదలైన 'బ్యాడ్ గర్ల్' (Bad Girl) సినిమాపై నటి శోభిత ధూళిపాళ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ట్రైలర్ విడుదలైనప్పుడు వివాదంలో చిక్కుకున్న ఈ మూవీపై శోభిత ప్రశంసల వర్షం కురిపించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

శోభిత ధూళిపాళ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'బ్యాడ్ గర్ల్' సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ఈ సినిమా చూసిన తర్వాత తాను కన్నీళ్లు పెట్టుకున్నానని, తన మనసులోని భావాలు వ్యక్తమైనట్లుగా అనిపించిందని రాసింది. తన రివ్యూలో ఆమె ఇలా రాసింది. "బ్యాడ్ గర్ల్ నన్ను నవ్వించింది. కన్నీళ్లు కూడా పెట్టించింది. నా మనసులోని భావాలు వ్యక్తమయ్యాయి. ఆవిష్కృతమయ్యాయి. ప్రతి నిమిషం మరింత పరిణతి చెందే సినిమా ఇది. ఈ సినిమాను అందరూ,

ముఖ్యంగా అమ్మాయిలు తప్పకుండా చూడాలని గట్టిగా సిఫారసు...