Hyderabad, జూన్ 27 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాయ్‌ఫ్రెండ్ గా భావిస్తున్న విజయ్ దేవరకొండ ఆమె లేటెస్ట్ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ పై స్పందించాడు. అయితే అతని రియాక్షన్ కంటే కూడా దీనికి రష్మిక ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ లో ఆమె విజయ్ ని విజ్జు అని పిలవడం విశేషం.

నటి రష్మిక మందన్నా తన రాబోయే మూవీ 'మైసా'లోని తన పాత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి అభిమానులను ఉత్సాహపరిచింది. శుక్రవారం (జూన్ 27) ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయింది. తన సోషల్ మీడియాలో, రష్మిక తన పాత్రకు సంబంధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను పంచుకుంది.

ఇది ఆమె అభిమానుల్లో అంచనాలను పెంచింది. ఈ సందర్భంగా రష్మిక బాయ్‌ఫ్రెండ్ గా భావిస్తున్న నటుడు విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ప్రత్యేక అభినందనలు చెప్పి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోర...