భారతదేశం, నవంబర్ 10 -- భారత క్రికెట్ చరిత్రలో నవంబర్ 2వ తేదీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సరిగ్గా ఆరోజే భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో తొలిసారిగా మహిళల క్రికెట్ ప్రపంచకప్‌ను ముద్దాడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో, దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఈ అపురూపమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ విజయాన్ని కొందరు సిగ్గులేని వాళ్లు వాడుకుంటున్నారంటూ తాజాగా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అనడం గమనార్హం.

ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ సభ్యులు వరల్డ్ కప్ విజయంతో ఒక్కసారిగా సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ అద్భుత విజయంతో ఐసీసీ నుంచి వచ్చిన రూ. 40 కోట్ల ప్రైజ్ మనీకి అదనంగా.. బీసీసీఐ ఏకంగా రూ. 51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రిచా ఘోష్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ వంటి ఆటగా...