Hyderabad, అక్టోబర్ 7 -- హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి కూడా ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు దీపావళి పండుగను ఆనందిస్తారు. ప్రతి ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. చీకటిలో వెలుగులు నింపే దీపావళి పండుగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? దీపం అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు సాగాలని సూచించే పండుగ అని చెప్పొచ్చు.

ఈరోజు సానుకూల శక్తి రావడానికి చాలా మంది రకరకాల దీపాలను వెలిగిస్తారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. లక్ష్మీదేవి, వినాయకుని విగ్రహాలను కూడా ఇంట్లో ప్రతిష్ఠిస్తారు. దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు. నరక చతుర్దశికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు యమధర్మరాజుని ఆరాధిస్తారు. యమధర్మరాజుని నరక చతుర్దశినాడు పూజిస్తే దీర్ఘాయువు లభిస్తుంది. ఇక ఈసారి నరక చతుర్...