భారతదేశం, జనవరి 11 -- సంక్రాంతి సెలవులు వచ్చేశాయ్. చాలా మంది సొంత ఊర్లలోకి వెళ్తున్నారు. మరికొందరు ఈ సెలవుల్లో ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సంక్రాంతి సెలవుల్లో అరుణాచలం వెళ్లేందుకు టూర్ ప్యాకేజీ (ARUNACHALA MOKSHA YATRA) అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీని ఐఆర్సీటీసీ టూరిజం ఆపరేట్ చేస్తోంది.

గత కొంతకాలంగా ఏపీ, తెలంగాణ నుంచి చాలా మంది భక్తులు అరుణాచలం వెళ్తున్నారు. పైగా సెలవుల సమయంలో వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ జనవరి 16వ తేదీన జర్నీ ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగాఅరుణాచలం మాత్రమే కాదు పుదుచ్చేరి, లకాంచీపురం కూడా చూడొచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.

హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే.. కంఫర్ట్ 3 ACలో ట్విన్ షేరింగ్ కు రూ. 19130, ట్రిపుల్ షేర...