భారతదేశం, జనవరి 22 -- ఉద్యోగం చేసే చాలా మంది ఎక్కువగా ఎదురుచూసేది లాంగ్ వీకెండ్ కోసం. ముందో.. వెనకో.. ఒక్క లీవ్ తీసుకుంటే.. మూడు, నాలుగు రోజులు ఎంజాయ్ చేసి రావొచ్చు. ఇప్పుడు కూడా మీరు లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. అందుకోసం ఒక్క లీవ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ సమయంలో మీరు అనేక ప్రాంతాలను తిరిగి రావొచ్చు.

జనవరి 23వ తేదీన శుక్రవారం లీవ్ తీసుకుంటే.. జనవరి 24న నాలుగో శనివారం, జనవరి 25 ఆదివారం, జనవరి 26 రిపబ్లిక్ డే కలిసి వస్తుంది. నాలుగు రోజులు కలిసి రావడంతో మంచి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే తిరుమల రథసప్తమి, మేడారం మహాజాతరకు వెళ్లి రావొచ్చు. ఈ సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయంలోనూ రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ లీవ్స్ మాత్రమే కాదు.. బ్యాంకు ఉద్యోగులు జనవరి 27వ తేదీన సమ్మె కూడా చేస్తున్నారు. వారానికి ఐదు రోజుల పని దిన...