Hyderabad, మే 1 -- రాత్రి భోజనం తర్వాత చాలా మంది కాసేపు నడుస్తూ ఉంటారు. ఇలా నడవడం మంచిదని అంటారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు ఇలా డిన్నర్ తరువాత నడవడం వల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుందని, బాగా నిద్ర పట్టేలా చేస్తుందని అంటారు. అందుకే తిన్న తర్వాత తేలికపాటి నడక తీసుకోవాలని తరచుగా వైద్యులు సిఫార్సు చేస్తారు. కానీ కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్న వారు మాత్రం అలా చేయకూడదు.

కొన్ని వ్యాధులతో బాధపడుతున్నవారు రాత్రి భోజనం తర్వాత నడిచే అలవాటు కూడా హానికరం. నైట్ వాక్ అందరికీ ప్రయోజనకరంగా ఉండదు. ప్రజలు తిన్న వెంటనే నడిస్తే వారి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చే కొన్ని ఆరోగ్య పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత ఏ వ్యక్తులు నడకకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

తీవ్రమైన ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు ఆహారం తిన్న వెంటనే నడకకు దూరం...