భారతదేశం, నవంబర్ 6 -- నటుడు ఇమ్రాన్ హష్మి ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'ది బా****డ్స్ ఆఫ్ బాలీవుడ్'లో ఒక అతిథి పాత్రలో కనిపించాడు. ఈ వెబ్ సిరీస్‌ను థియేటర్లలో విడుదల చేసి ఉండాల్సిందని అతడు అభిప్రాయపడ్డాడు. పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇమ్రాన్.. ఈ సిరీస్‌కు "బాక్సాఫీస్ వద్ద రూ. 600-700 కోట్లు" వసూలు చేసే సత్తా ఉందని అనడం విశేషం.

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమైన ఈ వెబ్ సిరీస్‌ను ఇమ్రాన్ హష్మి 'రాజకీయంగా తప్పు' అంటే కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉందని వర్ణించాడు. "మీకు తెలుసా, నేను మొదటి ఎపిసోడ్ కొంతమందితో కలిసి చూశాను.

అది మిమ్మల్ని ఆకర్షించడానికి కొంత సమయం తీసుకుంటుంది. కానీ ఆ తర్వాత కూడా మీరు ఆ సిరీస్ చూస్తూ ఉంటే.. 'వావ్ మీరు ఇంతకు ముందు చూడని దానికి ఇది భిన్నంగా ఉంది' అనిపిస్తు...