భారతదేశం, డిసెంబర్ 1 -- 'స్పిరిట్', 'కల్కి' సీక్వెల్ నుంచి దీపికా పదుకోన్ తప్పుకోవడానికి పని గంటలే కారణమన్న చర్చ టాలీవుడ్, బాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. దీనిపై తాజాగా సీనియర్ నటి మాధురీ దీక్షిత్ స్పందించింది. తాను 'వర్క్‌హాలిక్' అని, తన వెబ్ సిరీస్ కోసం 12 గంటలు పనిచేశానని చెబుతూనే, దీపికా నిర్ణయాన్ని సమర్థించేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సందీప్ రెడ్డి వంగా ప్రతిష్టాత్మక మూవీ 'స్పిరిట్' (Spirit), నాగ్ అశ్విన్ భారీ ప్రాజెక్ట్ 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ నుంచి స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తప్పుకోవడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఆమె కేవలం 8 గంటల షిఫ్ట్ మాత్రమే చేస్తానని కోరడమే ఇందుకు కారణమని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి సినీ పరిశ్రమలో పనివేళల గురించి వాడివేడి చర్చ నడుస్తోంది. తాజాగా ఈ డిబేట్‌లోకి సీనియర్ నటి మాధురీ దీక్షిత్ ...