భారతదేశం, నవంబర్ 13 -- నవంబర్ రెండో వారంలో ఓటీటీ ప్రేక్షకుల కోసం వివిధ రకాల కథాంశాలతో సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. జెన్-జెడ్ ప్రేమకథలు, సరోగసీ ట్విస్ట్‌తో కూడిన రొమాంటిక్ డ్రామా, దెయ్యాలున్న బంగ్లా కథ వంటి ఆసక్తికర కథనాలు ఈ జాబితాలో ఉన్నాయి. అవి కూడా తెలుగుతోపాటు వివిధ భాషలకు చెందినవి కావడం విశేషం. మరి వీటిలో చూడాల్సిన టాప్ 8 మూవీస్ గురించి తెలుసుకోండి.

కిరణ్ అబ్బవరం లీడ్ రోల్లో నటించిన మూవీ కే ర్యాంప్ శనివారం (నవంబర్ 15) నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కుమార్ (కిరణ్ అబ్బవరం) చదువు కోసం కేరళకు వెళ్తాడు. అక్కడ అతను మెర్సీ (యుక్తి తరేజా)ని కలుస్తాడు. మెర్సీకి కుమార్ ఎలా సహాయం చేస్తాడనేది ప్రధాన కథ. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద బాగా నడిచింది.

సిద్దూ జొన్నలగడ్డ నటించిన ఈ తెలుసు కదా మూవీ శుక్రవ...