Hyderabad, జూలై 10 -- ఓటీటీలో ఈవారం అనేక ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి. దేశ చరిత్రలోనే అత్యంత ప్రముఖ కేసులలో ఒకదానిపై దర్యాప్తు, కుల అణచివేత కథలు, ఐఐటీ ఆశావహుల ఆసక్తికరమైన ప్రయాణం వంటివి ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. జులై 7 నుండి జులై 13 వరకు విడుదలైన ఈ వారం ఉత్తమ ఓటీటీ సినిమాలు, సిరీస్‌ల జాబితాను భాషల వారీగా ఇక్కడ చూడండి.

హిందీతోపాటు తెలుగులోనూ అందుబాటులో ఉన్న వెబ్ సిరీస్ ది హంట్: ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దారుణ హత్య, ఆ తర్వాత జరిగిన దర్యాప్తు ఈ సిరీస్‌కు ప్రధానాంశం. ప్రఖ్యాత దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేశాడు. 90 రోజుల్లోనే ఈ కేసును ఛేదించి, నిందితులను ఎలా పట్టుకున్నారో ఈ సిరీస్ లో బాగా చూపించారు.

నరివెట్ట ఓ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ. టొవినో థామస్ నటించిన ఈ ఉ...