Hyderabad, ఆగస్టు 29 -- ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇక్కడ ఇస్తున్న జాబితాలోని సినిమాలు, వెబ్ సిరీస్ మిస్ కాకుండా చూడండి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీ లివ్, జీ5లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ వారం ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అడుగుపెట్టాయి. వాటిలో మిస్ కాకుండా చూడాల్సినవి ఇవే.

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చింది. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయి ఉంటే ఈ మూవీని ఓటీటీలో చూడండి. ఈ వీక్ ఓటీటీలోకి వచ్చిన పెద్ద తెలుగు సినిమా ఇదే.

ఇక నెట్‌ఫ్లిక్స్ లోకే వచ్చిన మరో మూవీ మెట్రో ఇన్ దినో. ఈ హిందీ సినిమా థియేటర్లలో సక్సెస్ సాధించిన తర్వాత శుక్రవారం (ఆగస్టు 29) డిజిటల్ ప్రీమియర్ అయింది. ఇది కూడా ...