భారతదేశం, డిసెంబర్ 5 -- ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ వారం వచ్చిన ఎన్నో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లలో నుంచి మీరు మిస్ కాకుండా చూడాల్సిన వాటి జాబితాను ఇక్కడ ఇస్తున్నాం. వీటిని నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, ఆహా వీడియోలాంటి ఓటీటీల్లో చూడొచ్చు.

రష్మిక మందన్న లీడ్ రోల్లో నటించిన మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. థియేటర్లలో పాజిటివ్ రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాని ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. థియేటర్లలో మిస్ అయి ఉంటే ఇప్పుడు చూసేయండి. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టీఫెన్ నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకే అడుగుపెట్టింది. అమ్మాయిల సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ మూవీ...