భారతదేశం, అక్టోబర్ 11 -- ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలు వచ్చాయి. స్పై, ఫాంట‌సీ, క్రైమ్‌, హార‌ర్‌, లీగ‌ల్.. ఇలా డిఫరెంట్ జోనర్లలో సినిమాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. వీటిల్లో స్పెషల్ గా ఉన్న ఈ చిత్రాలు వీకెండ్ కు బెస్ట్. ఈ మూవీస్ ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

వార్ 2 మాజీ రా ఏజెంట్ కబీర్ ధలివాల్ చుట్టూ సాగుతోంది. అతను కాళి కార్టెల్ లో చేరిన తర్వాత భారతదేశానికి ద్రోహం చేసినట్లు అనిపిస్తుంది. అతన్ని తొలగించడానికి ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ విక్రమ్ చలపతిని పంపుతుంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ స్పై థ్రిల్లర్ అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది.

ఇది తైవానీస్ హారర్ థ్రిల్లర్. ఇది కిడ్నాప్, మోసం ముఠాలో తమ కుమార్తెలను కోల్పోయిన ఇద్దరు తల్లులను అనుసరిస్తుంది. హంతకుడి మరణశిక్షతో అసంతృప్తి చెందిన వాళ్లు ప్రతీకారం తీర్చుకోవడాన...