Hyderabad, మార్చి 10 -- జుట్టు తెల్లగా మారే సమస్య చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఉంది. మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్య ప్రభావాల వల్ల, జీవనశైలి వల్ల జుట్టు నెరిసిపోయే సమస్య ఎక్కువవుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు వల్ల చిన్న వయసులోనే ప్రజలు జుట్టు తెల్లబడుతుంది. చాలామంది తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకునేందుకు రంగులు వేస్తూ ఉంటారు. రసాయనాలు కలిసిన రంగులను వేయడం జుట్టుకు, ఆరోగ్యానికి కూడా హానికరం. కాబట్టి ఇంట్లోనే పచ్చి పసుపు అంటే ముడి పసుపుతో తెల్ల జుట్టుకు నల్ల రంగు వచ్చేలా చేసుకోవచ్చు. పసుపు కొమ్ములు తెచ్చి మెత్తగా స్వయంగా పొడి చేసి పెట్టుకోవాలి. అదే ముడి పసుపు లేదా పచ్చి పసుపు.

మనదేశంలో పసుపును వేల సంవత్సరాలగా ఔషధమూలికగా ఉపయోగిస్తున్నారు. దీనిలో ఉండే గుణాలు, సమ్మేళనాలు మనకు ఎంతో మేలు చేస్తాయని పరిశోధనలో తేలింది...