భారతదేశం, నవంబర్ 28 -- ఈ వారం సౌత్ ఇండియన్ సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఇందులో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఒక్కో సినిమా స్పెషల్ గా ఉన్నాయి. ఇందులో మిస్టరీస్, గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి. అవి ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఓ సారి చూసేయండి.

మాస్ జాతర స్టోరీ న్యాయాన్ని కోరుకునే ఒక రైల్వే పోలీస్ అధికారి చుట్టూ తిరుగుతుంది. ఒక పెద్ద డ్రగ్ రాకెట్‌ను ఛేదించడంలో కీలకపాత్ర పోషించే అతనికి, ఒక క్రూరమైన ముఠాతో పోరాటం తప్పదు. ఆ ముఠా ప్రధాన ఆయుధం ఒక పాము. అతను ఒక పెద్ద స్మగ్లింగ్ సరుకును స్వాధీనం చేసుకున్నప్పుడు అతనికి, ముఠాకి మధ్య వైరం ఒక ఆల్-అవుట్ యాక్షన్ వార్‌గా మారుతుంది. మాస్ జాతర సినిమాలో రవితేజ, శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర తదితరులు నటించారు. ఇది నవంబర్ 28న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది.

తన ప్రియురాలు కైకేయిని ఆకట్టుకోవడానిక...