Hyderabad, జూన్ 15 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (వారఫలాలు) 15.06.2025 నుంచి 21.06.2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం

మాసం: జ్యేష్ట మాసం, తిథి : కృ. చవితి నుంచి కృ. ఏకాదశి వరకు

మేష రాశి వారికి ఈ వారం విశేషంగా కలసివస్తుంది. ఆత్మీయత, అనురాగంతో కుటుంబసభ్యులందరినీ మెప్పిస్తారు. తీర్థయాత్రలు విరివిగా చేస్తారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు మరింత వెలుగులోకి వచ్చే సమయం. చిన్ననాటి స్నేహితులతో మంచి చెడ్డా విచారిస్తారు. ఆదాయానికి మొదట్లో కొంత లోటు ఏర్పడినా తిరిగి పుంజుకుంటారు. ఎంతో కాలంగా అజ్ఞాతంగా ఉండి మీకు చేయూతనిస్తున్న వ్యక్తి తారసపడడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇంటి నిర్మాణాలపై సందిగ్ధత తొలగుతుంది. నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది. వృత్తులు, వ్యాపారాలలోని వారికి మరింత వెసులుబాటు, రాజకీయవేత్తలు, సాంకేతిక వర్గాలు,...