Hyderabad, జూన్ 22 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (వారఫలాలు) 22.06.2025 నుంచి 28.06.2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం

మాసం: జ్యేష్ఠ/ఆషాడ మాసం, తిథి : కృ. ద్వాదశి నుంచి శు. తదియ వరకు

మేష రాశి వారికి ఈ వారం కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూముల కొనుగోలు. నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకుంటారు. కళాకారులకు శుభవార్తలు. వారం చివరిలో ఆరోగ్య భంగం. పసుపు, లేత ఎరుపు రంగులు; ఆదిత్య హృదయం పఠించండి.

వృషభ రాశి వారు చేపట్టిన కార్యక్రమాలు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంతకాలం వేధించిన స...