Hyderabad, జూన్ 29 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (వారఫలాలు) 29.06.2025 నుంచి 05.07.2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం

మాసం: ఆషాడ మాసం, తిథి : శు. చవితి నుంచి శు. దశమి వరకు

మేష రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం. శుభ వర్తమానాలు, అదనపు రాబడి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు అనుకూలం. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయ వర్గాలకు సన్మానాలు, దూర ప్రయాణాలు. అనారోగ్యం, బంధు విరోధాలు. లేత నీలం, గులాబీ రంగులు. విష్ణు ధ్యానం చేయండి.

వృషభ రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. వాహనాలు కొంటారు. ఇంతకాలం పడిన కష్టం ఫలితమిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు ...