Hyderabad, జూలై 27 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (వారఫలాలు) 27.07.2025 నుంచి 02.08. 2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం

మాసం: శ్రావణ మాసం, తిథి : శు.తదియ నుంచి శు. అష్టమి వరకు

మేష రాశి వారం ప్రారంభంలో ఫలితాలను గమనించగా, జీవిత భాగస్వామితో, కుటుంబములోని సభ్యులతో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. వ్యాపార వ్యవహారములలో, స్నేహ సంబంధాలలో తగిన జాగ్రత్తలు అవసరం. ఆర్థిక విషయాలలో ఆటంకాలు, వాగ్దానాలు నిలుపుకోవడంలో ఇబ్బందులు, అనవసర ఖర్చులు కుటుంబ వ్యవహారాల్లో చికాకులను పెంచుతాయి. వారం మధ్యలో పౌరుషం పెరుగుతుంది.

నాయకత్వ లక్షణాల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. వ్యక్తుల సహకారాన్ని పొందుతారు. నూతన గృహ వాహనముల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వారాంతంలో ఆర్థిక ఖర్చులు నియంత్రణ అవసరం. కుటుంబ స్త్రీల సహకారాన్ని పొందుతారు. మానసిక ప్రశాంత...