Hyderabad, జూలై 13 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (వారఫలాలు) 13.07.2025 నుంచి 19.07. 2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం

మాసం: ఆషాడ మాసం, తిథి : కృ. తదియ నుంచి కృ. నవమి వరకు

మేష రాశి వారికి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు, ఆర్థికం సొమ్ముకు ఎటువంటి బాటు ఉండదు. అవసరాలు తీరతాయి. అలాగే పొదుపుపై దృష్టి సారిస్తారు. కుటుంబం, బంధువర్గం సహాయ సహకారాలు స్వీకరిస్తారు. ప్రధాన సమస్యలు తీరే సమయం. మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. ఆరోగ్యం కుదుటపడి ఉత్సాహంగా గడుపుతారు. చరస్థిరాస్తులు, ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వంశానుగతంగా దక్కవలసిన భూములు రావచ్చు.

వ్యాపారాలలో మీ అంచనాలకు అనుగుణంగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలు, ఉద్యోగాలలో పైస్థాయి అధికారులు మీ దీర్ఘకాలిక ఇబ్బందులు తీరుస్తారు. అలాగే వ్యాపారాలలో వచ్చిన లాభాలు సరిపె...