భారతదేశం, మే 11 -- ారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య ఈ వారం ప్రాథమిక మార్కెట్లో రెండు కొత్త ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతాయి. ఈ రెండూ ఎస్ఎంఈ ఐపీఓలు. మరోవైపు రెండు కంపెనీ షేర్లు లిస్ట్ అవుతున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

ఇంటిగ్రిటీ ఇన్‌ఫ్రాబిల్డ్ డెవలపర్స్ లిమిటెడ్ ఐపీఓ మే 13న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమవుతుంది. ఇది 12 లక్షల కొత్త షేర్లను జారీ చేస్తుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.12 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటిగ్రిటీ ఇన్‌ఫ్రాబిల్డ్ డెవలపర్స్ ఐపీఓ ధర ఒక్కో షేరుకు రూ.100, ఒక లాట్‌లో 1200 షేర్లు ఉంటాయి. ఈ ఐపీఓలో బిడ్ చేయడానికి మీరు కనీసం రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టాలి.

ఇంటిగ్రిటీ ఇన్‌ఫ్రాబిల్డ్ డెవలపర్స్ లిమిటెడ్ అనేది గుజరాత్ ప్రభుత్వంతో నమోదు చేసిన క్లాస్-ఎ సివిల్ కాంట్రాక్టర్ కంపెనీ. ఈ కంపెనీ ప్రభుత్వ నిర్...