భారతదేశం, జూలై 20 -- మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. మీకోసం గుడ్‌న్యూస్ ఉంది. వచ్చే వారం భారత మార్కెట్లోకి పలు కొత్త స్మార్ట్‌ఫోన్లు రానున్నాయి. ఏమేం ఫోన్లు రానున్నాయో తెలుసుకుందాం.. మీకు ఏ ఫోన్ నచ్చుతుందో చూడండి.

జూలై 24న ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. బ్లూ, సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీని కింద ఔరా రింగ్ లైట్ లభిస్తుంది. 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేసే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత.

డైమెన్సిటీ 7400 చిప్ సెట్‌తో 20,000లోపు వేగవంతమైన ఫోన్ అవుతుందని కంపెనీ టీజ్ చేసింది. ఇది భారతదేశం స్లిమ్ క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఇందులో 5700 ఎంఏహెచ్ బ్యాటరీని అందించా...