Hyderabad, అక్టోబర్ 13 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ మరింత రసవత్తరంగా మారింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9లోకి 15 మంది కంటెస్టెంట్స్ రాగా ఇద్దరి ఎలిమినేషన్ తర్వాత మరొకరు దివ్య నిఖితా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నలుగురు ఎలిమినేట్ అయ్యారు. వారిలో శ్రేష్టి వర్మ, మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఫ్లోరా సైని, శ్రీజ దమ్ము ఉన్నారు.

ఐదో వారం డబుల్ ఎలిమినేషన్ కారణంగా ఫ్లోరా సైని, దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయ్యారు. దాంతో పాత కంటెస్టెంట్స్ పది మంది మిగిలారు. ఇక ఆదివారం నాడు బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ 2.Oతో కొత్తగా ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. వారిలో దివ్వెల మాధురి, రమ్య మోక్ష, ఆయేషా జీనత్, నిఖిల్ నాయర్, గౌరవ్, శ్రీనివాస సాయి ఉన్నారు.

వీరితో కలిపి ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 16 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ...