భారతదేశం, డిసెంబర్ 23 -- ఓటీటీలో కొత్త వారం సినిమాల సందడి షురూ అయింది. ఈ సందడిని మరింత పెంచేస్తూ రెండు మలయాళం చిత్రాలు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇందులో ఒకటి ఫ్యామిలీ డ్రామా ప్యారడైజ్ కాగా, మరొకటి సర్వైవల్ థ్రిల్లర్ ఉల్లోరుక్కు.

ప్రతి వారం ఓటీటీలోకి కొత్త మలయాళం సినిమాలు వస్తూనే ఉన్నాయి. తెలుగు ఆడియన్స్ కూడా ఈ చిత్రాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెండు మలయాళ సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి.

మలయాళ సినిమాలు ప్యారడైజ్, ఉల్లోరుక్కు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్నాయి. డిసెంబర్ 24న ప్యారడైజ్, డిసెంబర్ 26న ఉల్లోరుక్కు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాబట్టాయి. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు వస్తున్నాయి.

2024ల...