Hyderabad, సెప్టెంబర్ 29 -- బిగ్ బాస్ తెలుగు 9 నుంచి మరొకరు ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు. మొదటగా బిగ్ బాస్ 9 తెలుగు హౌజ్‌లోకి 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా మూడు వారాలకు ముగ్గురు ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. గత వారం బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ దివ్య నిఖితా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

దీంతో ప్రస్తుతం హౌజ్‌లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరికి నాలుగో వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ ఇదివరకే పూర్తి అయింది. దీనికి సంబంధించిన బిగ్ బాస్ నామినేషన్స్ ఎపిసోడ్‌ను ఇవాళ ప్రసారం చేయనున్నారు.

ఈ వారం నామినేషన్స్‌లో ఫ్లోరా సైని, శ్రీజ ఉన్నట్లు సమాచారం. మిగతా నామినేటేడ్ కంటెస్టెంట్స్ జాబితా తెలియరాలేదు. ఇదిలా ఉంటే, ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకోడానికి అంటే సేఫ్ అవ్వడానికి బిగ్ బాస్ ఓ ...