భారతదేశం, అక్టోబర్ 10 -- వారం వారం ఓటీటీలోకి ప్రెష్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఈ వీక్ కూడా ఓటీటీ రిలీజ్ లు అదిరిపోయాయి. ఇందులో తెలుగు సినిమాలు మరింత స్పెషల్ గా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్‌ మల్టీ స్టారర్ నుంచి తేజ సజ్జా మిరాయ్ వరకు చాలా సినిమాలే వచ్చాయి. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు స్పెషల్ మూవీస్ పై ఓ లుక్కేయండి.

ఎప్పుడెప్పుడా అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నా వార్ 2 ఓటీటీలోకి వచ్చింది. తారక్, హృతిక్ రోష‌న్‌ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో ఇదే ఫస్ట్ మూవీ. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యాక్షన్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన వార్ 2 అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

లేటెస్ట్ తె...