భారతదేశం, ఆగస్టు 30 -- ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చేశాయి. వివిధ భాషల మూవీస్ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలో అడుగుపెట్టాయి. ఇందులో ఈ అయిదు సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇందులో క్రైమ్, స్పై, సస్పెన్స్, రొమాంటిక్ థ్రిల్లర్ తో పాటు ఓ మలయాళ ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. అవేంటో చూసేయండి.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ కింగ్డమ్. ఈ కథ శ్రీలంక ద్వీపానికి రహస్య మిషన్‌ కోసం కానిస్టేబుల్ సూరి వెళ్లడం గురించి వెల్లడిస్తుంది.అక్కడ అతను తన తప్పిపోయిన సోదరుడు శివతో తిరిగి కలుస్తాడు. బంగారు అక్రమ రవాణా ముఠాను ఎదుర్కొంటాడు. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ తదితరులు నటించిన ఈ మూవీ ఆగస్టు 27న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది.

అటామిక్ అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఇది మాక్స్ అనే అనుభవజ్ఞుడైన డ్రగ్ స్మగ్ల...