భారతదేశం, సెప్టెంబర్ 18 -- ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఈ వారం కూడా మలయాళ సినిమాలు క్యూ కట్టాయి. ఇందులో కొన్ని మిస్టరీ థ్రిల్లర్లు కూడా ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన 5 మలయాళం సినిమాల గురించి ఇక్కడ చెప్పుకుందాం. వీటిల్లో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఈ మలయాళం సినిమాలు ఏ ఓటీటీల్లో ఉన్నాయో చూసేద్దాం.

సస్పెన్స్ తో సాగే మలయాళ థ్రిల్లర్ 'రాండమ్ యామమ్'. నెమామ్ పుష్ఫరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ సెప్టెంబర్ 19న ఓటీటీలోకి రాబోతుంది. మనోరమా మ్యాక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో శ్వాసిక, ధ్రువన్, గౌతమ్, జాయ్ మాథ్యూ తదితరులు నటించారు. కథలో సోఫియాకు పాము కరుస్తుంది. మంత్రతంత్రాలతో సోఫియాను యధు కాపాడతాడు. యధుతో ఆమె ప్రేమలో పడుతుంది. కానీ యధు కుట్ర తెలుసుకుని ఎలా రివేంజ్ తీర్చుకుందన్నదే కథ.

ఈ వారం ఓటీటీలోకి రా...