భారతదేశం, ఆగస్టు 4 -- ఓటీటీ లవర్స్ అలర్ట్. ఈ వారం (ఆగస్టు 4 నుంచి 10 వరకు) డిజిటల్ స్ట్రీమింగ్ లో చాలా సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. ఇందులో తెలుగుతో సహా ఇతర భాషలకు సంబంధించినవి కూడా ఉన్నాడు. లవ్ స్టోరీ, స్పై థ్రిల్లర్, పొలిటికల్ డ్రామా, సర్వైవల్ థ్రిల్లర్ ఇలా డిఫరెంట్ జోనర్ల సినిమాలు, సిరీస్ లు వచ్చేస్తున్నాయి. ఇందులో తప్పకుండా చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఏవో ఇక్కడ తెెలుసుకుందాం.

తెలంగాణ మట్టి వాసనను చాటే స్వచ్ఛమైన కామెడీ లవ్ స్టోరీ 'మోతెవరీ లవ్ స్టోరీ'. ఇక్కడ మనషుల్లోని ప్రేమను, అనుబంధాలను, పల్లెటూరి వాతావరణాన్ని ఈ సిరీస్ లో చూసే అవకాశం ఉంది. జీ5 ఓటీటీలో ఆగస్టు 8 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ తో ఫేమస్ అయిన అనిల్ జీల ఇందులో హీరోగా నటించాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రా...