భారతదేశం, డిసెంబర్ 6 -- ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్ ల సందడి కొనసాగుతోంది. ఓటీటీలు వచ్చాక ఇతర భాషల కంటెంట్ ను కూడా తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం ఓటీటీలోకి తమిళ సినిమాలు, సిరీస్ లు వచ్చేశాయి. వీటిల్లో ఈ రెండు సిరీస్ లు, ఓ సినిమా చాలా స్పెషల్ గా ఉన్నాయి. ఈ మూడు క్రైమ్ థ్రిల్లర్లే. కేవలం ఓటీటీలో మాత్రమే వీటిని చూడొచ్చు.

సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ స్టీఫెన్. ఇది తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజైంది. ఫేక్ ఆడిషన్స్ తో తొమ్మిది మంది అమ్మాయిలను చంపిన సీరియల్ కిల్లర్ స్టోరీ ఇది. ఆ తర్వాత హంతకుడు లొంగిపోతాడు. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ లు భలే ఉత్కంఠను పంచుతాయి. ఇందులో గోమతి శంకర్, మైఖేల్ తంగదురై, స్మృతి వెంకట్, విజయశ్రీ తదితరులు నటించారు. ఇది డిసెంబర్ ...