భారతదేశం, డిసెంబర్ 22 -- ఈ వారం లీగల్ థ్రిల్లర్లు, చారిత్రక డ్రామాల నుండి పండుగ కుటుంబ కథల వరకు ఎన్నో వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇందులో కొన్ని చాలా స్పెషల్ గా ఉన్నాయి. ఈ స్పెషల్ వెబ్ సిరీస్ లు ఏవో ఓ లుక్కేయండి.

ఐ డాల్ ఐ అనేది దక్షిణ కొరియా లీగల్ థ్రిల్లర్ సిరీస్. దీనిని కిమ్ డా-రిన్ రచించారు. లీ క్వాంగ్-యంగ్ దర్శకత్వం వహించారు. ఈ ప్రదర్శనలో కిమ్ జే-యంగ్, చోయ్ సో-యంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ విజయవంతమైన డిఫెన్స్ న్యాయవాది మేంగ్ సే-నా ను అనుసరిస్తుంది. ఆమె తన అభిమాన డో రా-ఇక్ కేసును తీసుకుంటుంది. అతను హత్య ఆరోపణలు ఎదుర్కొంటాడు. ఇది ఇవాళ (డిసెంబర్ 22) నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ పీరియాడిక్ థ్రిల్లర్ సిరీస్ అమేడియస్ కూడా ఇవాళ ఓటీటీలోకి రిలీజైంది. ఇది జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. విల్ షార్ప్, పాల్ ...