భారతదేశం, డిసెంబర్ 27 -- ప్రతి వారం ఓటీటీలో కొత్త సందడి ఉంటుంది. ఇందులో తెలుగు సినిమాల వాటా కూడా ఎక్కువే. వివిధ జానర్లలో సినిమాలు తెలుగు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి వస్తాయి. ఈ వారం కూడా చాలా తెలుగు మూవీస్ వచ్చాయి. ఇందులో స్పెషల్ గా ఉన్న ఈ సినిమాలపై ఓ లుక్కేయండి.

ఈ వారం ఓటీటీలో తెలుగు ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటున్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. ఇది డిసెంబర్ 25న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది. ఈ సినిమాలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. ఓ సినిమా హీరో అభిమాని చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది. తన అభిమాన హీరో వందో సినిమా కంప్లీట్ చేయడానికి రూ.3 కోట్లు అవసరమవుతాయి. ఫ్యాన్ ఆ సాయం చేస్తాడు.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రివాల్వర్ రీటా. ఇది కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అన...